కొత్తగూడెంలో ఆదివారం 30వ డివిజన్ నందు బాండ్ దుర్గా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సీపీఐ నాయకులు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి Sk సబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, 52వ డివిజన్ కార్యదర్శి బానోతు ధనరాజ్, సహాయ కార్యదర్శి అజయ్ యాదవ్ తో పాటు పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు.