ధ్యానంతో విద్యార్థుల ఒత్తిడి దూరం: నిపుణుల సూచన

1చూసినవారు
పాల్వంచలోని స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ లో శుక్రవారం భద్రాద్రి జిల్లా పిరమిడ్ సేవాదళ్ ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన అవగాహన కార్యక్రమం జరిగింది. ధ్యాన నిపుణులు బి అంజయ్య, శోభా రాణి మాట్లాడుతూ, ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆందోళనలకు ధ్యానం సమర్థవంతమైన పరిష్కారమని తెలిపారు. ధ్యానం వల్ల విద్యార్థులలో మానసిక వికాసం, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్