పాత సూరారం బొడ్రాయి సెంటర్ వద్ద శ్రీ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం రోజున చిన్నపిల్లలకు విశేష సరస్వతీ దేవి పూజ నిర్వహించారు. స్వామివారి దివ్య సన్నిధిలో చిన్నపిల్లలు, విద్యార్థినీ
విద్యార్థులు భక్తిప్రపత్తులతో నమస్కరిస్తూ పూజలో పాల్గొన్నారు. పిల్లలు విజ్ఞానవంతులుగా ఎదగాలని, చదువులో రాణించాలని కోరుతూ ఈ విశేష పూజ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశారు. పూజానంతరం స్వామివారి ఆశీస్సులతో పిల్లలకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.