సుజాతానగర్: రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

64చూసినవారు
సుజాతానగర్: రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు అందజేసిన వెంటనే భూ సమస్యలు పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్‌ ప్రాజెక్టుగా సుజాతానగర్ మండలం ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుజాతానగర్ లోని సర్వరం, కోయగూడెం గ్రామాల్లో భూ భారతిలో భూ సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులను కలెక్టర్‌ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్