సుజాతనగర్ మండలం సిరిపురంలోని సుమారు 450 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన శివాలయంలో బుధవారం కార్తీక స్నానాలు, దీపారాధనలతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర వాహినిగా పిలిచే ఎదుళ్లవాగులో స్నానాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదిలారు. 'ఓమ్ నమశివాయ' నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.