కొత్తగూడెంలో మట్టల ఆదివారం

1చూసినవారు
కొత్తగూడెంలో మట్టల ఆదివారం సందర్భంగా సెయింట్ ఆండ్రూస్ చర్చిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. యేసు క్రీస్తు జెరూసలేం నగరంలోకి విజయప్రవేశం చేసిన సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని సెయింట్ ఆండ్రూస్ దేవాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఈత ఆకులు, తాటాకులు చేతబట్టి హోసన్నా నినాదాలతో యేసు క్రీస్తును స్మరించుకుంటూ ఊరేగింపులో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్