భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో కిన్నెరసాని ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో నిండిపోయి పర్యాటకులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఓవర్లోడ్ బూడిద లారీల రాకపోకల వల్ల రోడ్డు దెబ్బతింటోంది. హెల్మెట్ ధరించని వారికి చలాన్లు వేస్తున్న అధికారులు, ఓవర్లోడ్ లారీలపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.