పెండింగ్‌లో ఉన్న జూలూరుపాడు టన్నెల్ పనులు ప్రారంభించాలి.. మంత్రి తుమ్మల

858చూసినవారు
పెండింగ్‌లో ఉన్న జూలూరుపాడు టన్నెల్ పనులు ప్రారంభించాలి.. మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం పరిధిలోని జూలూరుపాడు టన్నెల్ పనులపై వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఆయన నీటిపారుదల శాఖమంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి, పాపకొల్లు గ్రామ పరిధిలోని 155 ఎకరాల భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించి, పెండింగ్లో ఉన్న టన్నెల్ పనులను ప్రారంభించాలని కోరారు. టన్నెల్ పనులు చేపట్టాల్సిన ఏజెన్సీ ప్రతినిధులను వనరులను సమీకరించుకోవాలని కూడా మంత్రి తుమ్మల సూచించారు.

సంబంధిత పోస్ట్