ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టులో గురువారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన తానం రాజేష్ (20) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్నేహితుడు గడ్డం సతీష్‌తో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లిన రాజేష్, పెద్ద చేపను పట్టుకునే ప్రయత్నంలో లోతైన నీటిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. స్నేహితుడు కాపాడే ప్రయత్నం చేసినా విఫలమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపునకు ఆటంకం ఏర్పడింది. ఈ ఘటనతో మొగరాళ్లగుప్ప గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.