కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నుకలిసిన తుమ్మల నాగేశ్వరరావు
ఢిల్లీలో మంగళవారం జరిగిన రబీ సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను కలిసి, క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ పామాయిల్ రైతులు నష్టపోతారని వివరించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించే నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా సంబంధిత మంత్రితో మాట్లాడాలని మంత్రి తుమ్మల కోరారు.