
ఇరాన్ యుద్ధం: ట్రంప్‌నకు పాక్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ తిరస్కరణ
పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందిగ్ధంలో పడ్డారు. ఇరాన్ తగ్గకపోవడంతో, ట్రంప్ పాకిస్తాన్‌ను మధ్యవర్తిగా చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వాదనలను తోసిపుచ్చింది. తమకు అసమంజసమైన డిమాండ్లు మాత్రమే అందాయని, అమెరికా నేరుగా చర్చలు జరపాలని, మధ్యవర్తిత్వాల ద్వారా యుద్ధం ముగింపు ఉండబోదని తేల్చిచెప్పింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ తన గగనతలం, సైనిక స్థావరాల వినియోగాన్ని నిషేధించింది.




