పాల్వంచ పట్టణ పరిధిలోని 44వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో డి. పి. ఎక్స్. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి అన్నదాన మహోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుండు రవికుమార్, బొల్లిపోగు రామకృష్ణ, 44వ డివిజన్ కార్పొరేటర్ విసంశెట్టి విశ్వేశ్వరరావు, 1104 యూనియన్ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాజేందర్, పాక దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు రవికుమార్ మాట్లాడుతూ, వినాయకచవితి సందర్భంగా నిర్వహించే అన్నదానం కేవలం ఆకలి తీర్చే కార్యక్రమం మాత్రమే కాదని, భక్తి, సామాజిక బాధ్యత అని అన్నారు.