పాత సూరారంలో సందడిగా వినాయకుడి మండపం వద్ద మహిళల ఆటలు

1365చూసినవారు
పాత సూరారంలో సందడిగా వినాయకుడి మండపం వద్ద మహిళల ఆటలు
పాత సూరారం బొడ్రాయి సెంటర్ వద్ద శ్రీ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మండపం వద్ద ఊరి మహిళలకు 5 రకాల ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు. పల్లెటూరి వాతావరణంలో మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా ఆటలాడుతూ సందడి చేశారు. పోటీల్లో ప్రతిభ చూపి గెలుపొందిన విజేతలకు యూత్ సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు. పండుగ వేళ మహిళల నవ్వులు, కేరింతలతో బొడ్రాయి సెంటర్ ప్రాంగణం అత్యంత కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో ఊరి మహిళలు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్