పాల్వంచలో వైఎస్ఆర్ 17వ వర్ధంతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోత్వాల మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్, పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు.