Mar 09, 2026, 15:03 IST/
బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య
Mar 09, 2026, 15:03 IST
బంగ్లాదేశ్‌లోని ఫెనీ జిల్లాలో 16 ఏళ్ల హిందూ బాలుడు శాంతో కుమార్ సాహాను దుండగులు దారుణంగా హత్య చేశారు. లాల్‌పోల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటోను లాక్కోవడానికి యత్నించిన దుండగులు, అడ్డుకున్న బాలుడిని కల్వర్టు కిందకి తోసి, ఆపై రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనం కిందకి తోసి చంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.