శుక్రవారం సాయంత్రం నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్ తో పనులు చేయడానికి వచ్చిన ఓ డ్రైవర్, స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పనుల కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లడంతో తోటి కార్మికులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.