
కరకగూడెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కరకగూడెం మండలంలో సోమవారం గ్రామీణ బ్యాంకు సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



































