Feb 09, 2026, 01:02 IST/ఇల్లందు
ఇల్లందు
ఇల్లందు: నిబంధనలు అతిక్రమిస్తే ఊచల లెక్కపెట్టడమే
Feb 09, 2026, 01:02 IST
ఇల్లందు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు డిఎస్పీ యు. వెంకన్న బాబు ఆదివారం హెచ్చరించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో ఓటింగ్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే శక్తులను అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.