మణుగూరులో 73% బొగ్గు ఉత్పత్తి

7చూసినవారు
మణుగూరులో 73% బొగ్గు ఉత్పత్తి
మణుగూరు సింగరేణి ఏరియాలో అక్టోబర్ నెలలో 73% బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు జీఎం దుర్గం రామచందర్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. 10,36,500 టన్నులకు గాను 7,52,484 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఓబీ వెలికితీత 64 శాతం విజయవంతమైందని, 107 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరిగినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్