ఆళ్లపల్లి: 108లో ప్రసవం

2చూసినవారు
ఆళ్లపల్లి: 108లో ప్రసవం
ఆళ్లపల్లి మండలంలోని కిచ్చన్నపల్లికి చెందిన గర్భిణి పాయం ఉమామహేశ్వరికి సోమవారం 108 అంబులెన్స్‌లోనే సుఖప్రసవమైంది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ పరమ ఆకాష్ సమయస్ఫూర్తితో ప్రసవం చేయగా, ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ సంఘటన వైద్య సిబ్బంది యొక్క అంకితభావాన్ని, సమయస్ఫూర్తిని తెలియజేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్