ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు నుంచి అక్రమంగా తరలిస్తున్న ముష్టిగింజలతో కూడిన బొలెరో వాహనాన్ని అటవీ అధికారులు బుధవారం పట్టుకుని సీజ్ చేశారు. ఈ ఘటనలో 1150 కేజీల ముష్టిగింజలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ఉత్పత్తులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేగళ్ల రేంజ్ అధికారి జస్వంత్ ప్రసాద్, బీట్ ఆఫీసర్ హెచ్చరించారు.