రంజాన్ పండుగ సందర్భంగా ఆళ్లపల్లిలో యువత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపునకు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. కె. సాబీర్ పాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయని, స్నేహ బంధాలను బలపరుస్తాయని, క్రీడాకారుల్లో సహకారం, సమన్వయం, దృఢనిశ్చయం వంటి లక్షణాలను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.