ఇల్లందు మునిసిపాలిటీలో దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చివరి రోజు జరిగే బతుకమ్మ వేడుకలకు వేలాది మంది మహిళలు హాజరుకానున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ఇల్లందులపాడు చెరువును సందర్శించి, మున్సిపల్ శాఖ అధికారులకు అన్ని ఏర్పాట్లు చేయాలని, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.