అశ్వాపురంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను అదుపులోకి తెచ్చారు.