అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీలో సర్పంచ్ మర్రి సంధ్య ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి, ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. రెండు చుక్కలు నిండు జీవితాన్ని కాపాడుతాయని ఆమె తెలిపారు.