భారత అణుశక్తి కమిషన్ (ఏసీ) చైర్మన్, అణుశక్తి విభాగం కార్యదర్శి డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి శనివారం అశ్వాపురం చేరుకున్నారు. ఆయన గౌతమీనగర్లోని భారజల ప్లాంట్ పర్ణశాల అతిథిగృహానికి విచ్చేశారు. భారజల ప్లాంట్ జీఎం జి. శ్రీనివాస్, కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏఈసీ చైర్మన్ సీఐఎస్ఎఫ్ సిబ్బంది, డాగ్స్కా్వడ్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.