అశ్వాపురం: ఉద్యోగి అదృశ్యంపై కేసు నమోదు

1295చూసినవారు
అశ్వాపురం: ఉద్యోగి అదృశ్యంపై కేసు నమోదు
అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మిట్టగూడేనికి చెందిన అక్కినపల్లి కిశోర్ (39) అనే ప్రైవేటు ఉద్యోగి అదృశ్యంపై కేసు నమోదైంది. కిశోర్ ఈ నెల 26న ద్విచక్ర వాహనంపై మణుగూరు వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ జి. అశోక్ ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. కిశోర్ ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్