అశ్వాపురం: అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై దళిత సంఘాల ఆగ్రహం

2చూసినవారు
అశ్వాపురం: అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై దళిత సంఘాల ఆగ్రహం
అశ్వాపురం పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు రాత్రికి రాత్రే తొలగించడంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదుట నిరసన చేపట్టారు. విగ్రహాన్ని తొలగించడం దళితుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్