మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి బుధవారం అశ్వాపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన రికార్డులు, కేసు ప్రాపర్టీలు, ఆయుధాలను పరిశీలించారు. అనంతరం సీఐ అశోక్ రెడ్డితో పాటు సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు సలహాలు అందించారు.