తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశ్వాపురం మండలానికి చెందిన పలువురు తమ రంగాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. మంగళవారం రామచంద్రాపురం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఏఎల్ఎమ్ సుబ్బారావు ఉత్తమ సేవలకు గాను తెలంగాణ ఎన్పిడిసిఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.