అశ్వాపురం గొల్లగూడెం వద్ద నలుగురు గంజాయి రవాణాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి సోదా చేయగా, రూ. 57,500 విలువైన 1.150 కేజీల గంజాయి లభించింది. దీంతో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు, కారును సీజ్ చేసినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.