అశ్వాపురం కళ్యాణపురం పంచాయతీ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ లకావత్ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామంలోని విద్యా, వైద్యం, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, సహకారం కీలకమని సర్పంచ్ పేర్కొన్నారు.