పదో ఫలితాల్లో సత్తా చాటిన అశ్వాపురం విద్యార్థులు

2024చూసినవారు
పదో ఫలితాల్లో సత్తా చాటిన అశ్వాపురం విద్యార్థులు
అశ్వాపురం మండలంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా నమోదయ్యాయి. మొత్తం 286 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 274 మంది ఉత్తీర్ణత సాధించి 92% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. 12 మంది విద్యార్థులు అనుతీర్ణులయ్యారని ఎంఈఓ వీరస్వామి తెలిపారు. నెల్లిపాక జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించి ప్రత్యేకతను చాటుకుంది. మల్లెలమడుగుకు చెందిన విద్యార్థిని 551 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, అశ్వాపురానికి చెందిన లహరి 550 మార్కులతో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్