అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు పంపుహౌస్ నుండి ఆయకట్టు రైతాంగానికి శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నీటిని విడుదల చేశారు. గోదావరి నీటిని వృధాగా సముద్రంలో కలవకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా దిగువకు నీటిని విడుదల చేసేందుకు పంపు హౌస్ మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ నీరు సుమారు 100 కిలోమీటర్ల వరకు వెళ్లి ఏన్కూర్ వద్ద NSP కాలువలో కలుస్తుందని, దీని ద్వారా దిగువన సాగుకు చేస్తున్న రైతులకు ఊరట లభిస్తుందన్నారు.