అశ్వాపురం మండలం అమీర్ధ వద్ద గోదావరి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఈసంపల్లి నవీన్ అనే వ్యక్తి వద్ద నుంచి పోలీసులు శనివారం ఒక ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేశారు. పిడిపిపి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసును నమోదు చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలిపారు.