అశ్వాపురం: బాధిత కుటుంబానికి చేయూత

0చూసినవారు
అశ్వాపురం: బాధిత కుటుంబానికి చేయూత
అశ్వాపురం మండలం బట్టీలగుంపులోని రాంనగర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన హరిబాబు కుటుంబానికి మణుగూరుకి చెందిన 'జనం కోసం మనం' స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. గురువారం ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యం, రూ. 10వేల నగదును అందజేశారు. సంస్థ వ్యవస్థాపకుడు గూడూరు కృష్ణారెడ్డితో పాటు సభ్యులు మురళి, గురుప్రసాద్, జశ్వంత్, సందీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్