అశ్వాపురం: రోడ్డు ప్రమాదాలు ఇద్దరికి తీవ్ర గాయాలు

987చూసినవారు
అశ్వాపురం: రోడ్డు ప్రమాదాలు ఇద్దరికి తీవ్ర గాయాలు
బుధవారం తెల్లవారుజామున అశ్వాపురం మండలంలో ఒక కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మరియు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఎటునాగారం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :