అశ్వాపురం: పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య

4చూసినవారు
అశ్వాపురం: పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య
అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన సరిత (25) అనే యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ కుమార్తె కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి మృతి చెందిందంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రాజేశ్ ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్