మణుగూరులో సింగరేణిని కాపాడాలని, పీకే ఓసీ డిప్సైడ్ బ్లాక్ను సింగరేణికి అప్పగించాలని, ఓసీ ఎక్స్టెన్షన్కు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సేవ్ మణుగూరు ఆధ్వర్యంలో మంగళవారం బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ బందుకు మద్దతుగా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలను బంద్ విజయవంతం చేయాలని కోరారు. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపారు.