భద్రాద్రి కొత్తగూడెం: నేడు పల్స్ పోలియో కార్యక్రమం

1577చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం: నేడు పల్స్ పోలియో కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు 98,818 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 1,001 కేంద్రాలు, 925 బూత్ బృందాలు, 38 మొబైల్, 38 ట్రాన్సిట్ బృందాలను ఏర్పాటు చేశారు. నేడు చుక్కలు వేయించుకోని చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మందు అందిస్తారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని డీఎంహెచ్ డాక్టర్ తుకారాం రాథోడ్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్