బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి పిఎస్పీడీ పీఎం6 వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 42 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. మంగళవారం షిఫ్ట్ బహిష్కరణలో భాగంగా నిరసన తెలుపుతుండగా, కాంట్రాక్టర్ బలవంతంగా లోపలికి పంపే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో జరిగిన తోపులాటలో రాడ్డుతో వెనుక నుంచి దాడి చేయడంతో ఓ కార్మికుడికి తలకు తీవ్ర గాయమైందని, తమపై ఇలాంటి దాడులు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.