బూర్గంపాడు మండలం సారపాకలో భారీగా గంజాయిని పోలీసులు మంగళవారం సిజ్ చేశారు. చత్తీస్‌గఢ్ నుంచి తరలిస్తున్న కంటైనర్‌ను తనిఖీ చేసిన పోలీసులు అందులో సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే గంజాయి ఉన్నట్లు సమాచారం. కంటైనర్‌లో రహస్యంగా గంజాయిని తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో సారపాక వద్ద అప్రమత్తమైన పోలీసులు కంటైనర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.