బూర్గంపాడ్: సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే

791చూసినవారు
బూర్గంపాడ్: సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే
బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని సుందరయ్య నగర్ కాలనీలో గల 215వ పోలింగ్ బూత్‌ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మండల అధికారులు, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సంబంధిత సిబ్బందితో కలిసి ఓటరు నమోదు, సవరణ, మార్పులు, తొలగింపులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్