బూర్గంపాడు మండలంలోని బుడ్డగూడెం గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున పోలీసులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నారు. కిన్నెరసాని నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఈ దాడులు సమాచారం మేరకు నిర్వహించబడ్డాయి.