మారుమూల గ్రామాల నుంచి వచ్చే ఆదివాసీలకు మెరుగైన సేవలు అందించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం బూర్గంపాడు సీహెచ్సీని తనిఖీ చేసిన ఆయన, ఆస్పత్రిలోని ఐపీ, ఓపీ గదులు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, నూతన భవన సముదాయాలను పరిశీలించారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.