బూర్గంపాడు: సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

60చూసినవారు
బూర్గంపాడు: సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 9న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణపై చర్చించారు. ప్రధాని మోదీ మొండి వైఖరితో కార్మికులు, కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్