బూర్గంపాడు: గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు

2చూసినవారు
బూర్గంపాడు: గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు
బూర్గంపాడుకు చెందిన షేక్ మున్వర్ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు, సోమవారం అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 2024 నుండి ఇప్పటివరకు కొత్తగూడెం, హైదరాబాద్ పరిధిలో అతనిపై ఐదు కేసులు నమోదయ్యాయి. బూర్గంపాడులో రెండు, లక్ష్మీదేవిపల్లిలో ఒకటి, ఈ బయ్యారంలో ఒకటి, 2025 ఏప్రిల్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 98 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. మొత్తం 287 కిలోల గంజాయి సరఫరా చేసినట్లు తేలడంతో, నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్