లంబాడాల ఆత్మగౌరవ సభకు పిలుపు: కుట్రలపై ఐక్య పోరాటం

1272చూసినవారు
లంబాడాల ఆత్మగౌరవ సభకు పిలుపు: కుట్రలపై ఐక్య పోరాటం
ఆదివారం మానుకోటలో లంబాడాల ఆత్మగౌరవ సభ జరగనుంది. లంబాడీలపై జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవడానికి ఐక్యంగా పోరాడాలని ఈ సభ పిలుపునిస్తోంది. రాష్ట్రంలోని తండాలలో ఉన్న లంబాడీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. పినపాక నియోజకవర్గ సేవాలాల్ సేన సలహాదారుడు ఇస్లావత్, కోటియా & మణుగూరు మండల సేవాలాల్ సేన మహిళా అధ్యక్షులు ఇస్లావత్, ద్వాలి ఈ పిలుపునిచ్చారు. జై సేవాలాల్, జై బంజారా, జై మేరమ్మ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్