మణుగూరు నుంచి వీఎం బంజర్కు ట్రాలీ ఆటోలో తరలిస్తున్న ఏడు పశువులను అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పట్టుబడిన పశువులను పాల్వంచ గోశాలకు తరలించారు. మణుగూరుకు చెందిన మహమ్మద్ హైమద్, ఎండీ యాకూబ్పాషా, కల్లూరుకు చెందిన షేక్ అజ్మత్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అక్రమ గో రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.