భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు సమయం ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసినట్లు హైకోర్టు న్యాయవాది ఎం. సాంబశివరావు తెలిపారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.